Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ 5 d ago

8K News-27/03/2025 దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 77,087.39 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 77,082.51 - 77,747.46 పాయింట్ల మధ్య కదలాడిన సూచీ.. చివరికి 317.93 పాయింట్ల లాభంతో 77,606.43 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 105.10 పాయింట్లు లాభపడి 23,591.95 వద్ద ముగిసింది.